తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు!

 

Weather: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు!

అమరావతి: రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది..

ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. గంటకు 30-40కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది.

మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిక్కు నుంచే వీచే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. రాబోయే మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీచే అవకాశముందని చెప్పారు..

Akhand Bhoomi News

error: Content is protected !!