అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు సాధ్యం.

 

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు సాధ్యం.

కోటనందూరు(అఖండ భూమి):

అంకితభావంతో పనిచేసినపుడే గుర్తింపు లభిస్తుంది మండల విద్యాశాఖాధికారి AVS శ్రీనివాస్ అన్నారు.కోటనందూరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేస్తూ డీఎస్సీ-98 ద్వారా ఇటీవల ఉపాధ్యాయుడిగా విధులలో చేరిన పసగడుగుల బాబ్జిని ఎం ఈ ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాబ్జిని ఘనంగా సత్కరించారు.ప్రభుత్వ విద్యా పథకాలు పాఠశాలలకు చేరవేయడంతోపాటు,ఈ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో సిఆర్పి గా బాబ్జి చేసిన సేవలు ఆదర్శనీయం అని ఎంఈఓ శ్రీనివాస్ అన్నారు.పాతికేళ్ల నాటి ఉపాద్యాయుడిగా ఉద్యోగం సాధించాలన్న కల ఎట్టకేలకు నెరవేరడంతో ఉపాధ్యాయ సేవలు శక్తివంచనలు లేకుండా అందించాలన్నారు.ఈసందర్భంగా బాబ్జిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సి ఆర్ పి శేఖర్,కంప్యూటర్ సహాయకుడు మనీష్,అకౌంటెంట్ లోవరాజు,సిబ్బంది గోవింద్, నాగేశ్వరరావు,సుందరరావు,తంగేటి నాగేశ్వరరావు,సూర్యనారాయణ, పద్మ,సత్యవేణి,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!