ఉద్యోగుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి

 

సిపిఎస్ రద్దుతో ఉద్యోగుల జీవితాలలో వెలుగులు ఎన్నికలలో ఉద్యోగుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి

రామ్ కొండ సర్పంచ్ పి.హారిక

తుగ్గలి జూన్ 14 (అఖండ భూమి) :

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ను రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలలో వెలుగులు వచ్చాయని రామ్ కొండ సర్పంచ్ పటేల్ హారిక అన్నారు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల పాదయాత్ర లో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగిందని అన్నారు. ఎన్నికల పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి దానిని రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు అడగకమునుపే కొత్త పిఆర్సి అమలు చేసేందుకు కమిటీ వేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గురించి పట్టించుకోకపోవడంతో పాటు ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాల పథకాల ప్రవేశపెట్టి వాటిని పార్టీలకు అతీతంగా అందరికీ అందే విధంగా చేశారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి అవసరమో వారి వద్దకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇచ్చిన హామీలను కాపీ కొట్టి వాటిని అమలు చేస్తానని ఎన్నికల మేని పోస్టులో ప్రకటించడం ఎవరు ప్రజలు నమ్మరన్నారు. గతంలో రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు ప్రజలకు తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఇచ్చిన ఉచిత వాగ్దానాలను ఎవరు నమ్మరని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అలాగే ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మరోసారి పత్తికొండ నుండి ఎమ్మెల్యేగా కావడం ఖాయమని ఆయన అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!