బాలల భవితకు భాగస్వామ్యమే…భాగీదారి కార్యక్రమం
వెల్దుర్తి జూన్ 14 (అఖండ భూమి) : బాలల భవితకు భాగస్వామ్యమే…భాగీదారి కార్యక్రమం అని అంగనవాడి టీచర్స్ అన్నారు. ఈ సందర్భంగా వెల్దుర్తి పట్టణంలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు కలిసి జన భాగీదారి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని
పురవీధుల్లో ర్యాలీ చేశారు. చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు. బాలల భవితకు భాగస్వామ్యమే అంగన్వాడి టీచర్లు అన్నారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రీస్కూల్లో
చేర్పించడానికి తల్లితండ్రులు బాధ్యత వహించాలన్నారు. 5 సంవత్సరాలు పూర్తయిన వారిని ఎలిమెంటరీ పాఠశాలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంతో పిల్లలు బడికి వస్తే వారికి పోషకాహారాలు
అందించబడతాయన్నారు. కోడిగ్రుడ్లు, ఆహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ విద్య-ఆటపాటల విద్య అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో
నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు విజయకుమారి, ఈదమ్మ, సరస్వతి, వరలక్ష్మి, రామలక్ష్మి, హెబ్సిబా, మహాబూబీబీ, జ్యోతి, సుజాత,
షమీన, రేణుక, షబాన, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



