ద్విచక్ర వాహనాలలో హీరో సంస్థదే మొదటి స్థానం… జడ్పిటిసి సుంకన్న.
వెల్దుర్తి జూన్ 14 (అఖండ భూమి) : నేడు నడిపిస్తున్న ద్విచక్ర వాహన మోటర్ సంస్థల నందు హీరో సంస్థదే మొదటి స్థానం అని జెడ్పిటిసి సుంకన్న అన్నారు. బుధవారం వెల్దుర్తి పట్టణంలోని హీరో షోరూం నందు నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ హీరో మోటర్ కార్పు గత 23 సంవత్సరాల నుండి నిరంతరాయంగా తన స్థానాన్ని నెంబర్ నెంబర్ వన్ టూ వీలర్ తయారీ కంపెనీగా కొనసాగిస్తోంది, అంతకుముందు హెచ్ఎంసిఎల్ ఉత్పత్తి నుండి అన్ని టు వీలర్ కస్టమర్లు ప్యాషన్ ప్లస్ మోడల్, విపరీతంగా ఆమోదించబడింది.
ఇప్పుడు అదే ప్యాషన్ ప్లస్ వాహనం నేడు దేశవ్యాప్తంగా తమ సంబంధిత డీలర్‌ల ద్వారా వివిధ ప్రదేశాలలో
తిరిగి ప్రారంభించబడుతోంది. ఆ క్రమంలో ఈరోజు కొత్త ప్యాషన్ ప్లస్వారి ఫైనాన్షియర్‌లు మరియు పాత ప్యాషన్ ప్లస్ గల కస్టమర్‌లచే ప్రారంభించబడింది. ఈ ప్యాషన్ ప్లస్ లో అంతర్నిర్మిత కొత్త ఫీచర్లు తో మెరుగైన పనితీరు మరియు ఇంజిన్ లైఫ్‌ని పెంచడం కోసం పూర్తిగా ఎఫ్ ఐ ఎనేబుల్డ్ ఇంజన్, యు ఎస్ బి రకం మొబైల్ ఛార్జ్, అసమాన రోడ్లపై సౌకర్యవంతమైన రైడ్‌లు, అద్భుతమైన డ్రైవబిలిటీ, మంచి టర్నింగ్ సామర్థ్యం మరియు పదునైన మలుపులు, తక్కువ రన్నింగ్ ధరతో మెరుగైన మైలేజీ, 5 ఉచిత సేవలు మరియు 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీతో వినియోగదారులు మనశ్శాంతిని పెంచుకోండి అని కంపెనీ మేనేజర్ అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం మెకానికులు సూపర్వైజర్లు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.



