కౌలు రైతులకు కౌలు కార్డుల పంపిణీ… వ్యవసాయ అధికారి

వెల్దుర్తి జూన్ 14 (అఖండ భూమి) :

వెల్దుర్తి మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ నందు

గ్రామ విఆర్ఓ లకువీఆర్ఏలకు కౌలు కార్డుల కౌలు రైతుల తో

సమావేశం నిర్వహించడం జరిగిందిని మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తెలిపారు. బుధవారం

రాముళ్లకోట గ్రామంలో కౌలు రైతు అయిన చావాడి

వెంకట రమణకి కౌలు కార్డును పంపిణి చేయడమైనది

అర్హులైన కౌలురైతులందరూ  గ్రామ వీఆర్వో ని సంప్రదించి కౌలు కార్డులనుపొoదాలని తెలియజేయడం జరిగింది

కౌలు కార్డులు జారీ చేయడం వల్ల భూ యజమానులకు

ఎటువంటి నష్టం జరగదని  అవగాహన కల్పించాలని

వీఆర్వోలకు ఆదేశించడం జరిగింది  కౌలు పై భూములను

సాగుచేస్తున్న కౌలు రైతులకు తప్పనిసరిగా కౌలు కార్డులను

జూన్ నెల అఖరు లోపు  జారీ చేయాలని వీఆర్వోలను

ఆదేశించడం జరిగింది కౌలు రైతులకు వ్యవసాయ రాయితీ        పథకాలు కౌలు రైతులు కౌలుకార్డు పొంది

పంట నమోదు చేసుకోవడం వల్ల రైతు భరోసా, ఉచిత

పంటల బీమా, సున్నా వడ్డీ, బ్యాంకులో పంట రుణాలు,

కనీస మద్దతు ధర పై పంట దిగుబడుల అమ్మకం వంటి

పథకాలు లబ్ధి పొందవచ్చు.కౌలురైతులు కౌలుకార్డులను

తీసుకొని మీ గ్రామములోని  రైతు భరోసా కేంద్రమును

సంప్రదించగలరుఈ కార్యక్రమంలోఆర్. అక్బర్ భాష, మండల వ్యవసాయ అధికారి, వెల్దుర్తి, ఆర్ ఐ వెల్దుర్తి, వీఆర్వోలు వీఆర్ఏ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!