రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు పై అధికారుల సమావేశం…
వెల్దుర్తి జూన్ 14 (అఖండ భూమి) :
ప్రభుత్వ ఆదేశాల మేరకువిద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ అడ్వైజరి కమిటీ సమావేశం రైతులతో ఈరోజు రామళ్లకోట సబ్ స్టేషన్ నందు రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా హై రైతులతో సమావేశం నిర్వహించినట్లు విద్యుత్ అధికారి ఐ రాఘవేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని రామళ్లకోట గ్రామం నందు విద్యుత్తు సబ్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన అడ్వైజరి కమిటీ మెంబర్ మరియు రైతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించిన విద్యుత్ సరఫరా పరిస్థితి, రైతులకు 9 గంటల ఉచిత పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఉన్నచో రైతులను అడిగి తెలుసుకోవడం జరిగిందినీ పేర్కొన్నారు.
రామళ్లకోట సబ్ స్టేషన్ పరిధిలో లో వోల్టేజీ సమస్య పరిష్కారం కొరకు వెల్దుర్తి నుంచి రామళ్లకోట వరకు నూతన 33 కెవి లైన్ వేసి వెల్దుర్తి నుంచి విద్యుత్తు సరఫరా చేయడం జరిగిందినీ తెలిపారు.
సబ్ స్టేషన్ పరిధిలోని మొత్తం నాలుగు ఫీడర్లకు గాను రెండు వ్యవసాయ ఫీడర్లకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరియు మిగతా రెండు లీడర్లకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ విద్యుత్తు ఇవ్వడం జరుగుతుందినీ చెప్పారు.
అలాగే రైతులకు నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కొరకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గురించి వివరించడం జరిగినదిని తెలిపారు.
తదుపరి జగనన్న ఇళ్లకు సంబంధించి నూతన విద్యుత్ కనెక్షన్ గురించి వివరించడం జరిగినది మరియు ఏవైనా వివిధ విద్యుత్తు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
పాల్గొన్నవారు.. వెల్దుర్తి విద్యుత్ ఏయి రాఘవేంద్ర ప్రసాద్,
ఐ.రాఘవేంద్ర ప్రసాద్ , జడ్పిటిసి సుంకన్న, విహెచ్ఎ రామళ్లకోట సాంబశివుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..