కంబాలపాడు గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి…
డోన్ (క్రిష్ణగిరి) జూన్ 14 (అఖండ భూమి) : మండల పరిధిలోని కంబాలపాడు గ్రామoలో వున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల /కాలేజీ నందు ఇదే మండలం పోతుగల్లు గ్రామ మజారా గ్రామమైన గుండ్ల మల్లాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబుకు ముగ్గురు సంతానం అందులో పెద్దకూతురు లూథియా (ప్రస్తుతం 8వ తరగతి) నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ నందు ఈరోజు సాయంత్రం సీలింగ్ ఫ్యాన్ కు తన చున్నీతో ఉరివేసుకొని చనిపోయినది..
ఈ అమ్మాయి వేసవికాలం సెలవులు ముగించుకుని ఈరోజు సాయంత్రం 4: 52 నిమిషాలకు తన తండ్రితో పాటు స్కూల్ నందు ప్రవేశించినట్లు రిజిస్టర్లో నమోదు అయినది. సాయంత్రం 6:10 నిమిషాలకు స్కూల్ కేర్ టేకర్ అమ్ములు మరియు హెల్త్ టేకర్ కళావతి ఇద్దరూ మెస్సు నందు భోజనానికి పిలవడానికి వెతకగా అమ్మాయి కనబడలేదని ఈ సందర్భంగా క్లాస్ రూమ్ లో వెతకగా నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్లో అమ్మాయి ఉరి వేసుకున్నట్లు కనపడిందని సమాచారం.. ఈ స్కూలు ఈనెల 12వ తేదీ తెరవబడినది.. ప్రస్తుతానికి 72 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈరోజు అమ్మాయి సాయంత్రం వచ్చిన గంటకే ఉరి వేసుకొని చనిపోయినది… మరణానికి కారణాలు క్రిష్ణగిరి పోలీసులు విచారిస్తున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..