జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం..

 

 

Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం..

ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది..

సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది..

Akhand Bhoomi News

error: Content is protected !!