ఆ పాఠశాల విద్యార్థి యే ఉపాధ్యాయుడిగా… మిత్రులతో సన్మానం
వెల్దుర్తి జూన్ 13 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థిగా విద్యను అభ్యసించి అదే పాఠశాలకు ఉపాధ్యాయుడుగా వచ్చి పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన ఉపాధ్యాయుడికి మిత్రులు సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి మిత్రులు మాట్లాడుతూ
వెల్దుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో నే చదువుకుని వెల్దుర్తి పాఠశాల కే ప్రధానోపాధ్యాయుడు గా వచ్చి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసిన జమ్ములన్న వెల్దుర్తి జిల్లా పరిషత్ పాఠశాల నుండి గోవర్ధనగిరి పాఠశాలకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనను 1988- 89 పదవ తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ తరఫున ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. పూర్వ విద్యార్థులందరూ వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి సమిష్టి గా కృషి చేయాలని జమ్ములన్న కోరారు..ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరిసింహనాయుడు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పామయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు..
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



