రేపు నుండి ఉపాధి పనుల గ్రామసభలు… ఏపీఓ రాజు నాయక్
వెల్దుర్తి జూన్ 13 (అఖండ భూమి) : మండలంలోని 23 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల గ్రామ సభలు జరుగుతున్నట్లు ఏపీవో రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి సోషల్ ఆడిట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు ఉపాధి పనులు ఏ విధంగా జరిగాయి అన్న కోణంలో ఎస్ఆర్పిలు, డిఆర్పీలు విచారణ చేపడతారని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు జరిగిన పనులను వెలికి తీసి చివరి రోజున ఓపెన్ ఫారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సోషల్ ఆడిట్ కార్యక్రమానికి ఎస్ఆర్పిలు ఇద్దరు డిఆర్పిలు పదిమంది దాకా పాల్గొని పనులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



