కేసుల్లో నేరస్థులకు శిక్ష పడేట్లు చేసినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది 

కేసుల్లో నేరస్థులకు శిక్ష పడేట్లు చేసినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది

ఎస్పీ వకుల్ జిందాల్

దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ పై దృష్టి సారించాలి

బాపట్ల క్రైమ్ బ్యూరో జూన్ 13 (అఖండ భూమి) : ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం చేసిన వ్యక్తికి త్వరితగతిన కోర్టులో శిక్ష పడితే మరొకరు అటువంటి నేరాలను చేయటానికి భయపడతాడని, తద్వారా నేరాల సంఖ్యని, నేర ప్రవృత్తిని కట్టడి చేసి శాంతి భద్రతలు నెలకొల్పోవచ్చని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులకు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కోర్టు మోనిటరింగ్ సిస్టం తో, పెండింగ్ కేసులలో త్వరిత గతిన ఏ విధంగా విచారణ పూర్తి చేయాలి అనే విషయాల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు పోలీస్ అధికారులు వారి పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల్లో శిక్ష పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న 20 కేసులను ఎంపిక చేసుకొని వాటి ట్రయిల్ విషయంలో ప్రతిరోజు పర్యవేక్షించుకుంటూ ఉండాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ తో, కోర్టు సిబ్బందితో మరియు న్యాయమూర్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలని తెలిపారు. కేసును ముందుకు సాగేలా సాక్షుల చేత స్వేచ్ఛగా నిర్భయంగా సాక్ష్యం చెప్పే లాగా తర్ఫీదు ఇవ్వాలని, ముద్దాయిలు క్రమం తప్పకుండా హాజరయ్యేలాగా చూడాలని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన నేరాల్లో త్వరగా శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసుల్లో విచారణ త్వరగా జరిగి నేరస్తులకు శిక్ష పడటం వలన కొత్తగా నేరం చేయాలనుకునే వాళ్ళకి భయం కలుగుతుందని, వారు నేరం చెయ్యాలనే ఉద్దేశం నుండి విరమించుకుంటారని తెలిపారు.పాత కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి, వాటికి ట్రైల్ కోర్టులో జరుగుతుందా లేదా అనే విషయం మీద శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అధికారులు ఎంపిక చేసుకున్న 20 కేసుల్లో మహిళల మీద జరిగిన కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

బుధవారం గురువారం జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ ల డౌన్లోడ్ కి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరపాలని అధికారులు నిర్ణయించినట్లు

ఈ క్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులను మరియు గ్రామ, వార్డు వాలంటీర్లను సమన్వయపరచుకొని, అందరూ కలిసి అత్యధికంగా దిశ యాప్ లు డౌన్లోడ్ చేయించాలని, దిశ యాప్ ప్రతి ఒక్క మొబైల్ లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, దిశ యాప్ లు డౌన్లోడ్ చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!