తోకల నాగభూషణం కు ఘాన సన్మానం
గుంటూరు మే 13 , (అఖండ భూమి) :
తిరుపతి జిల్లా గూడూరు లో ఆం.ప్ర ఎరుకుల ప్రజా సంక్షేమ సేవ సంఘాం నూతన రాష్ట్ర వైస్ చైర్మన్ తోకల నాగభూషణం కు ఘనంగా సన్మానం జరిగినది. ముందుగా గూడూరు పట్టణంలో అంభేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పట్టణం లో ర్యాలీ గా బయలుదేరి స్థానిక టిడిడి కళ్యాణ మండపం నందు సభకు వందలాదిగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏకలవ్య విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ శంకర్ అధ్యక్షతన నూతనంగా ఎన్నుకైనటువంటి రాష్ట్ర వైస్ చైర్మన్ తోకల నాగభూషణం కు ఘనంగా సన్మానించడం జరిగినది.
తోకల నాగభూషణం మాట్లాడుతూ మన ఏపీ లో గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు.
ఈ నాలుగు ఏళ్ల లో మా యస్టీ లకు ఏమీ చేశారని ప్రశ్నించారు. రాజ్యంగబద్ధమైన యస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశారు.గిరిజనుల గ్రామాల అభివృద్ధి లేదు.టెన్త్ ఫలితాలలో సుమారు 30 గురుకుల పాఠశాలలో 0 % రిజల్ట్ వచ్చింది. సరైన విద్య ను గిరిజన విద్యార్థులకు ఇవ్వడం లో విఫలమయ్యారు ఈ ప్రభుత్వం. కొత్తగా జీవో నెం.52 ను తెచ్చి అభివృద్ధి చెందిన బీసీ కులాలను మా ఎస్టీ లలో కలపడం దారుణమన్నారు.మా గిరిజన హక్కులను ఎవరైనసరే కాలరాస్తే చూస్తూ ఊరుకోము రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తాంమని తోకల నాగభూషణం హేచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సాకే చిరంజీవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కిరణ్ కుమార్,రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి సభ్యురాలు సాకే చంద్రకళ కుటుంబసభ్యులు పాల్గొనడం జరిగింది.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



