
సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో శరవేగంగా దిశా యాప్ నమోదు కార్యక్రమం…
వెల్దుర్తి జూన్ 15 (అఖండ భూమి) : వెల్దుర్తి మండలంలో దిశా యాప్ వెల్దుర్తి సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో శరవేగంగా నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువారం ప్రతి ఇంట, ప్రతి నోట దిశా యాప్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వెల్దుర్తి పట్టణంలో ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాపు దగ్గర, వాహనదారులకు దిశ యాప్ ను వాటి ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. దిశా యాప్ మహిళలకే కాదు ప్రతి ఒక్కరికి ప్రమాద నివారణ దిక్సూచిలా పనిచేస్తుందని అన్నారు. మహిళ పోలీసులు, కానిస్టేబుల్స్ ముమ్మరంగా యాప ప్రయోజనాలు నమోదు కార్యక్రమాలను ధన ధన్ మొబైల్ నందు డౌన్లోడ్ చేసి శభాష్ దిశా యాప్ అన్న కోణంలో పోలీస్ కృషి చేస్తుంది. మండుటెండలలో పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ ప్రతి ఒక్కరి మొబైల్ నందు దిశ యాప్ ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు మహిళా పోలీసులు హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


