భవనం నిర్మించారు… రోడ్డు మరిచారు..
నిర్మాణం పూర్తి కాకుండానే అప్పగించిన కాంట్రాక్టర్లు…
వైద్యశాల చుట్టూ ఇన్ కంప్లీట్ రోడ్డు నిర్మాణం…
ఇబ్బందులు పడుతున్న రోగులు…. డాక్టర్లు…
వెల్దుర్తి జూన్ 15 అఖండ భూమి వెబ్ న్యూస్ :

గత కొన్ని సంవత్సరాలుగా వెల్దుర్తి పట్టణం నందు ప్రభుత్వ వైద్యశాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి ప్రజలకు పాఠకులకు విదితమే. అయితే కొన్ని సంవత్సరాలుగా సిహెచ్సి నుండి పీహెచ్సీగా మార్చారు. 30 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు చాలా కాలం నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు కోట్లు నిధులను వెచ్చించి నిర్మాణాలను ప్రారంభం చేశారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం భవన నిర్మాణం మాత్రమే మాకు సంబంధం రోడ్డు నిర్మాణం మాకు ఎటువంటి సంబంధం ఉండదని తెలపడం జరిగింది. భవన నిర్మాణం పూర్తి చేశాక మిగిలిన బడ్జెట్లో చేసేందుకు ప్రయత్నం చేస్తామని కాంట్రాక్టర్లు తెలిపారు. అయితే ఇన్ కంప్లీట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను అప్పగించడంతో డాక్టర్లు రోగులు ఇబ్బందులు పడుతున్న తీరు వెలుగు చూస్తుంది. వైద్యశాల చుట్టుపక్కల ఎటువంటి రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో రోడ్డు సక్రమంగా లేకపోతే రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణము, సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసి భవనం నిర్మాణం కంప్లీట్ చేయాలని వెల్దుర్తి పట్టణ మండల ప్రజలు కోరుతున్నారు.


