విద్యార్థిని లూథియా మరణం పట్ల అనుమానాలు…?
విద్యార్థిని శివంతో చలగాటమాడుతున్న అధికారులు
పోస్టుమార్టం కొరకు ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు..
వెల్దుర్తి జూన్ 15 (అఖండ భూమి) : కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం కమ్మలపాడు గ్రామం సమీపాన ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కాలేజీ నందు గుండ్ల మల్లాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబు కూతురు లూధియా (14) లు మృతి చెందిన సంగతి పాఠకులకు విధితమే. అయితే లూధియా శవానికి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు ఇష్టం వచ్చినట్లుగా తరలించడం పట్ల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు పోస్టుమార్టం నిర్వహించే డాక్టరు లేరు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నది అన్న సంగతి అధికారులకు తెలుసు. అయితే శవం పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినిని హాస్టల్ నందు వదిలిన తర్వాత సంబంధిత స్కూల్ యాజమాన్యం సక్రమంగా కేర్ తీసుకోకపోవడం విద్యార్థిని మృతికి కారణమని అనుమానాలు లేకపోలేదు. పోస్టుమార్టం కొరకు విద్యార్థి శవాన్ని ఒకచోట నిలకడగా లేకుండా క్రిష్ణగిరి పోలీసులు అటు ఇటు తిప్పడాన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు సమాచారం. ప్రజా సంఘాల నాయకులు విద్యార్థిని మృతి పలుకోనాలలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. లూధియా మరణం పట్ల సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



