జాకేరులో ఇంటింటి కొళాయిలకు రూ 4.50లక్షల వ్యయం
కొళాయిలను ప్రారంభించిన ఎంపీపీ
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
వేపాడ జూన్ 23(అఖండ భూమి):- మండలంలోని జాకేరు గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది.స్థానిక ఎంపీటీసీ టీవీ రమణ, గ్రామ సర్పంచ్ బుద్ద చిన్నమ్మలు అప్పలనాయుడు దంపతుల విజ్ఞప్తి మేరకు ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు స్పందించి గ్రామంలో ఇంటింటి కొళాయిలకు మండల పరిషత్ నుంచి రూ 4.50లక్షలు మంజూరు చేయడంతో పనులు చక చకా జరపడమే కాకుండా స్థానిక యాతపేట ప్రజలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పించగా శుక్రవారం ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు ఇంటింటి కొళాయిలను ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామ మాజీ ఉపసర్పంచ్ బుద్ధ అప్పలనాయుడు, ఎంపీటీసీ టీవీ రమణ మాట్లాడుతూ తాగునీటి కోసం ఎంపీపీ చొరవతీసుకొని ఇంటింటి కొళాయిలతో పాటు అదనంగా బోరు బావికి కూడా నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు.అలాగే గ్రామప్రజలు కూడా ఈ సందర్బంగా హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పట్నాయక్, వైస్ ఎంపీపీ అడపా ఈశ్వరరావు, ఎంపీటీసీ ఆకుల సత్యనారాయణ, ఉపాధిహామీ ఏపీవో ఆదిలక్ష్మి, గ్రామ మహిళా పోలీస్ సంతోషి కుమారి, వైసీపీ నాయకులు అడపా హరీష్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.



