జాకేరు ఫిల్డ్ అసిస్టెంట్ గా కాటపల్లి దేవి
నియామకపత్రం అందజేసిన ఎంపీపీ దొగ్గ
వేపాడ జూన్ 23 (అఖండ భూమి):- మండలంలోని జాకేరు క్షేత్ర సహాయకురాలిగా కాటపల్లి దేవిని ప్రభుత్వం ఎంపిక చేసింది. గతంలో ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన కాటపల్లి శ్రీను ఈ ఏడాది జనవరి 21న అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆకారణంగా కుటుంబం వీదిన పడగా ఆ పోస్టుకు అర్హురాలుగా ఉన్న మృతుడు శ్రీను భార్య దేవిని ఎంపిక చేయడం జరిగింది. ఈ మేరకు నియామక పత్రాన్ని ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు చేతులు మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు అప్పలనాయుడు దంపతులు, అరిగిపాలెం, సోంపురం ఎంపీటీసీ సభ్యులు టీవీ రమణ, ఆకుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ అడపా ఈశ్వరరావు, ఎంపీడీఓ పట్నాయక్, ఉపాధి హామీ ఏపీవో ఆదిలక్ష్మి, టెక్నీకల్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.నూతన క్షేత్ర సహాయకురాలు దేవి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన గ్రామ సర్పంచ్ దంపతులు ఎంపీటీసీ టీవీ రమణ, ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తదితరులకు రుణపడి ఉంటానని అన్నారు.



