జాకేరు ఆర్బికేలో సబ్సిడీపై విత్తనాలు పంపిణీ.

 

జాకేరు ఆర్బికేలో సబ్సిడీపై విత్తనాలు పంపిణీ.

వేపాడ,జూన్,23(అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండలంలోని జాకేరు సచివాలయం పరిధిలోని జాకేరు,కరకవలస,గుడివాడ గ్రామాల రైతులకు మండల పరిషత్ అధ్యక్షుడు దొగ్గ సత్యవంతుడు చేతుల మీదుగా సబ్సిడీ పై వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.మూడు గ్రామాల రైతులకు మొత్తంగా 284 మంది రైతులకు గాను 367 విత్తనాల బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.అలాగే స్వర్ణకు సంబంధించి 41మంది రైతులకు సంబంధించి 51 బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.1121 కిగాను 209 మంది రైతులకు 278 బ్యాగులను అందించారు. అదేవిధంగా సాంబ మసూరికి 33 మంది రైతులకు గాను 36 బ్యాగులను అందించారు. సోనామసూరి ఒక రైతు రెండు బ్యాగులను తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి రైతులకు సరైన సమయంలో విత్తనాలను ఎరువులను అందిస్తుందన్నారు. మండలంలోని రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను, విత్తనాలను తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పట్నాయక్, ఉపాధి హామీ ఏపీఓ ఆదిలక్ష్మి, వైస్ ఎంపీపీ అడపా ఈశ్వరరావు,అరిగిపాలెం, సోంపురం,ఎంపీటీసీలు తొండవరపు వెంకటరమణ, ఆకుల సత్యనారాయణ( సత్తిబాబు), గ్రామ మాజీ ఉప సర్పంచ్ వైసీపీ నాయకులు బుద్ధ అప్పలనాయుడు,సూరిబాబు, అగ్రికల్చర్ అసిస్టెంట్ దుర్గాభవాని, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గణేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో 1:- రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్న దృశ్యం.

Akhand Bhoomi News

error: Content is protected !!