కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన గిరిజన యువతతో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి.

 

కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన గిరిజన యువతతో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి.చేతివాటం ప్రదర్శించిన ఆధార్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి.

చింతపల్లి  అఖండ భూమి వెబ్ న్యూస్ :

చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆధార్ కేంద్రంలో అవకతవకలు జరగడంతో జిల్లా కలెక్టర్ స్పందించి సీజ్ చేయడం శుభ సూచకమే అయినప్పటికీ మండలంలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన గిరిజన యువతతో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచందర్రావు, ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అండ్రాబు లక్ష్మణరావు లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకాలం ఈ ఆధార్ కేంద్రంలో మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో వచ్చి ఆధార్ నమోదు కోసం పడరాన్ని పాట్లు పడ్డారని, ఒకరోజులో రావలసిన ఆధార్ నమోదు ను వారం రోజులపాటు తిరిగి తిండి తిప్పలు లేక ఇంటికి తిరిగి వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయని అటువంటి సమస్యలు పునరుద్ధం కాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన గిరిజన యువతకు ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆధార్ సేవలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన 50 రూపాయలకే హాజరు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అదనపు 100 నుంచి 200 వరకు ఆధార్ నిర్వాహకులు వసూలు చేయడం తగదన్నారు. అటువంటి వ్యక్తులకు ఆధార్ కేంద్రం పూర్తిగా తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది గిరిజన యువతి యువకులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఉన్నారని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి గిరిజన యువతి యువకులచే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని వారు సూచించారు. ఆధార్ కేంద్రంలో జరిగిన అవకతవకలపై అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!