జగనన్న పాలనంతా పేదల పక్షమేడేరు శాసనసభ్యులు కొటగుళ్లి భాగ్యలక్ష్మి

చింతపల్లి అఖండ భూమి జూన్ 23 వెబ్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు బంధువని, ఆయన పాలన అంతా పేద పక్షాన్నే సాగుతుందని పాడేరు శాసనసభ్యులు *కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి * అన్నారు. చింతపల్లి మండలం అన్నవరం గ్రామ సచివాలయం పరిధిలోని పనసలపాడు, నేరేడు వీధి, భరంగ్‌బంధ , అన్నవరం, గ్రామాల్లో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 243 గడపలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి గడపలోనూ ఎంత మొత్తంలో సంక్షేమ లబ్ధి చేకూరిందో వివరించారు. స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను కొన్నింటిని వెంటనే పరిష్కరించారు. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన *జగనన్న సురక్ష* గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికీ మిగిలిన పోయి పరిష్కారం కాని సమస్యలను జగనన్న సురక్ష కార్యక్రమంలో పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్లకు వచ్చే ప్రజా ప్రతినిదులు, వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా *భాగ్యలక్ష్మి గారు* మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు* కోరుకుంటుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్షాలని తెలిపారు. పేదవాడెప్పుడూ పేదవాడిగానే ఉండాలని చంద్రబాబునాయుడు ఆలోచనని అందుకే పేదలకు ఇచ్చే ఇళ్ల దగ్గర నుంచి గడపగడపకు అందించే సంక్షేమ పథకాల వరకు అన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఎంతో పారదర్శకమైన పాలన అందిస్తూ ఇప్పటికీ పరిష్కారం కానీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం ఇదే తొలిసారి అన్నారు. ఇప్పటికే 99.05 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన 05 శాతం సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం సర్పంచ్ పాంగి సన్యాసిరావు, స్థానిక ఎంపీటీసీ కొర్ర సూరిబాబు, గ్రామ పెద్దలు వంతల మంజు, ఎంపీపీ కొరబు అనూష, దేవి వైస్ ఎంపీపీ గోపి నాయక్ శారదా, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, మండల అధ్యక్షులు మోరి రవి, మండల కన్వీనర్ పాంగి గుణ బాబు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత, ఎంపీటీసీలు మఠం రాజులమ్మ, మీనా కుమారి, ఎంపీటీసీ మోహన్ రావు, నాయకులు బెన్ని బాబు బొజ్జన దొర, సోషల్ మీడియా కన్వీనర్ కురసా తిరుపతి, తాజాంగి వైస్ సర్పంచ్ గెమ్మెల రవి, నాయకులు వంతల వినీత్, చంటి , ఎంపిటిసి పాంగి బాబురావు, కోఆప్షన్ సభ్యులు నాజర్ వలీ, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


