యు టీ ఎఫ్ అనంతగిరి మండల కార్యవర్గ సమావేశం
అల్లూరి జిల్లా:అనంతగిరి(అఖండ భూమి) జూన్ 23;అనంతగిరి మండల కేంద్రములో గల గిరిజన సంఘ భవనంలో యు టీ ఎఫ్ కార్యవర్గ సమావేశాన్ని యు టీ ఎఫ్ జిల్లా కార్యదర్శి పుడిగి.దేముడు,పూర్వ సహ అధ్యక్షుడు . శెట్టి. రాంబాబు, సీనియర్ నాయకులు వి.వి.ఈశ్వర రావు, ఆద్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు:సంతాప తిర్మానం
2023-24 సభ్యత్వ నమోదు
బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించుట నిమిత్తం
సీ పి ఎస్ రద్దు చేసే వరకు పోరాటం.
సర్విస్ రూల్స్ సంబంధించిన అంశాలపై చర్చ
మండల విద్యాభివృద్ధి పై విషయాలపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యు టీ ఎఫ్ నాయకులు కమిడి.రఘు, గార.నారాయణరావు, పరమేశ్వర రావు, దేముడు,సూర్య ప్రకాష్, మల్లేశ్వర రావు, మొదలైన వారు పాల్గొన్నారు.



