లంగుపర్తి, నేలపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో జన్ బాగీదారీ కార్యక్రమం.
అల్లూరి జిల్లా:అనంతగిరి (అఖండ భూమి)జూన్ 21:మండలం, లంగుపర్తి , నేలపాలెం అంగన్వాడి కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఝాన్సీ అద్వర్యం జన్ (బాగీదారీ) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జన్ని సన్యాసిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడి సూపర్వైజర్ మాట్లాడుతూ బాలామృతం పిల్లలకు ప్రీస్కూల్లో చేరటానికి అక్షరాభ్యాసం చేసి ఏడు నెలల పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిపిస్తూ, అంగన్వాడీ కేంద్రం యొక్క ప్రాముఖ్యత, అంగన్వాడీ విద్య ఆటపాటల ద్వారా అందించబడుతుందని కావున ప్రతి తల్లిదండ్రులు 3 సంవత్సరములు నిండిన ప్రతి పిల్లలును అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని తెలియచేయడం జరిగింది. ప్రతి గర్భిణీ, బాలింత,0-6 సంవత్సరములు పిల్లలు అంగన్వాడీ సేవలు పొందాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ సి డి యస్ సూపర్వైజర్ , పూర్వ జడ్పిటిసి దూరు గంగన్నదొర, ఎమ్మెస్ కే శిరీష,గ్రామ సచివాలయ సిబ్బంది, మానషి సంస్థ సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



