అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) మే3న ఆదివాసి జెఏసి జికె వీధి మండల కమిటీ సమావేశం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొర్ర బలరాం,రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధి రీమెల పాలు,జిల్లా ప్రతినిధులు గొర్లె యేసువరరాజు,కొర్ర నీలకంఠంలతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ బోయవాల్మీకి,బెంతి ఒరియా కులాలను గిరిజన జాబితాలో కలపాలని అసెంబ్లీ చేసిన తీర్మాణానికి వ్యతిరేఖంగా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి పూనుకొన్నది.దానిలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆదివాసీలను ఐక్యం చేయాలని,తమ హక్కులు,చట్టాలు కాపాడుకోవడానికి,ప్రభుత్వాలు ఆదివాసీలకు చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు త్రిప్పికొట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి ఏర్పడిందని,ఈ నెల 16 వ తారుఖున విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర చైర్మన్ గా విశ్రాంతి ఐఎఎస్ అధికారి డా.తమర్బ బాబురావు నాయుడుతోపాటు రాష్ట్ర కార్యవర్గం ఏర్పడగా,28 వతారీఖునా అల్లూరి సీతరామరాజు జిల్లా,29 తారీఖున మన్యం పార్వతీపురం జిల్లా,30 వతారీఖున శ్రీకాకుళం జిల్లా కార్యవర్గాల ఎన్నిక ఎంపిక జరుగుతుందని,మే 1నుండి మండలాల కార్యవర్గాలు ఎంపిక చేయడం జరుగుతుందని,మే 5,6,7 తారీఖులలో ఉభయ గోదావరి జిల్లాల (రంపచోడవరం,చింతూరు,పోలవరం)కార్యవర్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని,ఆ తర్వాత పంచాయితీ,గ్రామస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి,ఉద్యమాన్ని ఉదృతం చేయాలని సంకల్పించామని,ఆదివాసీలంతా సహాకరించాలని ఆయన కోరారు.