రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి. ట్రూ అప్ చార్జీలను ఎత్తివేయాలని సీపీఐ. రాష్ట్ర సమితి పిలుపుమేరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు మద్దతుగా టిడిపి. కాంగ్రెస్. పార్టీలు మద్దతు..
వెల్దుర్తి జూన్ 30 (అఖండ భూమి) :
వెల్దుర్తి పట్టణంలో విద్యుత్ కార్యాలయం నందు ధర్నా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ .టిడిపి మండల నాయకులు ఐజయ్యా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ బాషా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ కరెంటు చార్జీలు తగ్గించాలని అదేవిధంగా నిత్యవసర సరుకులు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఆకాశాన్ని అందుతున్నాయి కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు విద్యుత్ ఛార్జీలు 8సార్లు పెంచుకుంటూ ప్రజలపై భారాలు మోపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాబట్టి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను కరెంటు బిల్లులను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు కృష్ణ. బాలు రాజు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు. అలుగుండు ఎల్లప్ప. బోగోలు గ్రామ నాయకులు కుళ్లాయప్ప. శ్రీరాములు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు. టిడిపి నాయకులు రాంబాబు. రాఘవేంద్ర. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు



