Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి!
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి..
ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.
మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…