Viveka Murder Case: వివేకా హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించింది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా.. ఇది మూడోది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



