ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి అనే అన్న ఎన్టీఆర్ నినాదం తీసుకుని విజయవాడ పార్లమెంట్లో పనిచేయడం జరుగుతుంది ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని )
ఈరోజు ఉదయం విజయవాడ పార్లమెంట్ సభ్యుని కార్యాలయం కేశినేని భవన్ వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల్లోని 28 గ్రామాల తాగునీటి అవసరార్థం 28 వాటర్ ట్యాంకర్లను ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారు, టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట ఇన్చార్జి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్లో 25లక్షల మంది ప్రజలు కృష్ణానది పక్కన ఉన్నా కూడా వారి దాహార్తి తీర్చటం వేసవికాలంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఫంక్షన్ లో ఉన్నప్పుడు లేకపోతే నా కార్యక్రమాలు ఉన్నప్పుడు నీరు అందించడంలో పడుతున్న ఇబ్బందిని నేను గమనించాను. ప్రతి వ్యక్తి దాహం తీర్చాలి అనే ఒక బహుతరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్లు, చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయినట్లు ప్రతి వ్యక్తి కూడా ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్ ఏ, ప్రతి వ్యక్తి అవసరం కూడా ఇంపార్టెంట్
ఏదానిలో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి వ్యక్తి దాహార్తి తీర్చేందుకు ఈకార్యక్రమం చేపట్టాం దానిలో భాగంగా ఎవరు అడిగినా కూడా గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, వాటర్ ట్యాంకర్లు అందజేస్తున్నాం
ఆటోనగర్ నీటి సమస్యతో ఇబ్బంది పడుతుంది. ఆటోనగర్లో 80,000 మంది పనిచేస్తారు ఇప్పటికీ కూడా అక్కడ ఓవర్ హెడ్ టాంకర్ లేదు ఆటోనగర్ ఐలా అసోసియేషన్ కోరిక మేరకు 1కోటి 96లక్షలు ఎంపి నిధులతో 90వేల లీటర్ల సామర్థ్యంతో భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం రెండు మూడు నెలల్లో పూర్తి అవుతుంది.
300 గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు ఎంపీ నిధుల ద్వారా ఇస్తున్నాం.
ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి అని అన్న ఎన్టీఆర్ గారి నినాదం తీసుకుని విజయవాడ పార్లమెంట్లో పనిచేయడం జరుగుతుంది దాన్ని పార్టీలకతీతంగా, వర్గాలకి , కులాలకి మతాలకి , అతీతంగా ఏదైతే ప్రజలకి ఉపయోగపడుతుంది ఆ పనే చేస్తున్నాం*
నిన్న అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి గురుకుల పాఠశాలలో 95 లక్షలు పెట్టి నిన్న సమావేశ మందిరానికి శంకుస్థాపన చేశాం, పాఠశాలలో 320 మంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారు.
320 మందిని చూస్తే నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్లే కానీ అక్కడున్న పరిస్థితి చూస్తే 320 మంది కూడా మంచి ఆణిముత్యాలు లాగా తయారయ్యే పరిస్థితి ఎక్కడ ఉంది*
గిరిజన నాయకుల అభ్యర్థన మేరకు అక్కడ సమావేశ మందిరం ఇచ్చాం*
*ముఖ్యంగా ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు, అడుగున వర్గాలకి ఉపయోగపడే కార్యక్రమాల్ని తీసుకున్నాం సహకరించిన ప్రజాప్రతినిధులకి అధికారులకి మీడియా మిత్రులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు*
*కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలు కంచికచర్ల మండలానికి 11 వాటర్ ట్యాంకర్లు ఇచ్చాం, రెండవ విడతలో ఏ.కొండూరు మండలానికి 16 వాటర్ ట్యాంకర్లు ఇచ్చాం, ఏ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్య ఉంది అది మా ప్రభుత్వంలోనే గుర్తించాము*
*పలుమార్లు పార్లమెంట్లో కూడా నేను కిడ్నీ సమస్య మీద మాట్లాడాను. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ,50 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కొండూరు మండల నీటి సరఫరా కోసం నిధులు కేటాయించేలాగా చర్యలు తీసుకున్నాను.ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల కోసం 2.50కోట్లు ఎంపీ నుదులని ఇచ్చాం.ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గం లోని గ్రామాలకు 28 వాటర్ ట్యాంకర్లును ఇస్తున్నాము.ఇంకా దాదాపు 245 మంచినీటి ట్యాంకర్లు అందించాల్సింది ఉంది. ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకి ,అధికారులకి ప్రజలకి, అందరికీ నా కృతజ్ఞతలు ఓ మంచి పని చేయాలి అంటే అందరి సహకారం కావాలి దీవెనలు కావాలి. ఆ సహకారం, దీవెనలు అందించిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు అనీ కేశినేని నాని అన్నారు. ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ
విజయవాడ పార్లమెంటు గ్రామాలలో వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లను అందజేసిన ఎంపీ శ్రీ కేసినేని శ్రీనివాస్ నాని గారికి ముందుగా తాతయ్య గారు అభినందనలు తెలిపారు
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) గారు విజయవాడ పార్లమెంటు పరిధిలో గల గ్రామపంచాయతీలకు ఏ గ్రామ పంచాయితీకి మంచినీటి ట్యాంకు అవసరమో ఆ గ్రామానికి పార్టీలకతీతంగా అందజేశారన్నారు. ఇది ఎవరికి రాని ఆలోచన ఎంపీ నాని గారు ఆలోచించి ప్రతి గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ గ్రామ పంచాయతీలో నిధులు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది ఇటువంటి సమయంలో అందరి యొక్క ఆలోచనలు తెలుసుకొని ఏది అవసరమో అది ఆ గ్రామపంచాయతీకి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. గతంలో కూడా ఎంపీ కేసినేని శ్రీనివాస్ (నాని) గారు టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కీముల కన్నా టాటా ట్రస్ట్ ద్వారా ఎంపీ నాని గారు చాలా మందికి సేవ చేశారన్నారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ లాంటి ఎన్నో రకాల పనులు చేశారన్నారు.విజయవాడ పార్లమెంట్ అంటే దేశంలో ఒక ఆదర్శవంతమైన పార్లమెంటుగా తీర్చిదిద్దారన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు అభిమానులు పాల్గొన్నారు



