పార్టీ ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటా…

 

ఢిల్లీ: తెలంగాణ బీజేపీ సారథిగా సీనియర్‌ నేత కిషన్‌ రెడ్డికి అధినాయకత్వం పట్టం కట్టింది. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

ఈ నేపథ్యంలో తాజాగా కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో కిషన్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను. ప్రధాని మోదీ సభ తర్వాత అధికారికంగా బాధ్యతలు తీసుకుంటాను. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తాను. ఈరోజు రాత్రి 8 గంటలకు పదాధికారులతో సమావేశం జరుగుతుంది. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయాలి. రెండు పదవులు నిర్వహించడం కష్టం అని కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. కిషన్‌ రెడ్డితో పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. మంత్రవర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రమంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..

Akhand Bhoomi News

error: Content is protected !!