పసలపూడి గ్రామంలో ఘనంగా జరిగిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు.

 

పసలపూడి గ్రామంలో ఘనంగా జరిగిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు.

రాయవరం (అఖండ భూమి):డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వైఎస్సార్ 74 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు,అరుణ ఇండస్ట్రీస్ అధినేత,పసలపూడి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చింతా కాటమరెడ్డి గారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చింతా నర్శిరెడ్డి కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ చింతా రామ్మోహన్ రెడ్డి,వైసిపి నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న మహానేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి,స్వీట్లు పంచినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి,బ‌డుగు,బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం డాక్టర్‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని,ఆయ‌న మ‌ర‌ణంలేని మ‌హానేత‌ అని,ఆరోగ్యశ్రీ,104,108 సేవ‌లు,ప్రతీ పేదవాడికి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ ఇచ్చి ఉన్నత చదువులు చదివించుటలో ఆయన కృషి చరిత్ర మరువలేదని,రైతుల‌కు ఉచిత విద్యుత్‌,జ‌ల‌య‌జ్ఞం ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవిగానే ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి,ఉప సర్పంచ్ పోతంశెట్టి సాయి రామ్మోహన్ రెడ్డి,పంచాయతీ వార్డు మెంబర్లు కాకర అనంతలక్ష్మి,చింతా విజయలక్ష్మి,కోరుకొండ వెంకటరమణ,వైసిపి యువనాయకుడు పోతంశెట్టి సత్యనారాయణ రెడ్డి(సత్తిబాబు),నాయకులు పోతంశెట్టి సత్య స్వరూప రెడ్డి,ఎస్ ఎస్ ఎఫ్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి,చింతా సుబ్బారెడ్డి మాస్టారు,తాడి అమ్మిరెడ్డి (అనిల్),మల్లిడి వీర్రాఘవరెడ్డి (రాఘవ),కొవ్వూరి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!