Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఏపీ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు అదృష్యానికి వలంటీర్లే కారణం ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది..
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. అలాగే పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, 10 రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) పవన్‌ను కోరారు.
పవన్‌పై ఫిర్యాదు
పవన్ వ్యాఖ్యలపై వలంటీర్లు (Volunteers) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ (Uravakonda Police Station)లో పవన్‌పై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ వారు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. వారాహి యాత్రలో పవన్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు వ్యాఖ్యానించారు. వలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్లు ఏం చేస్తున్నారో.. పవన్‌కల్యాణ్ చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ వలంటీర్లు నినాదాలు చేశారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



