- .
హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ కురిసినవర్షం బీభత్సం సృష్టిస్తోంది. సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి కళాసిగూడలోని నాలా ఫుట్‌పాత్ పైకప్పు నుంచి పడి 6 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది..రాణా వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్తున్న క్రమంలో నాలాలో పడి కొంత దూరం కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది సాయంతో నాలాలోని చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..