న్యూ ఇండియా పార్టీ ఆద్వర్యంలో ఆర్థిక స్వేచ్ఛ విజయసంకల్ప యాత్ర 

 

గోదావరిఖని ఏప్రిల్ 29 : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని న్యూ ఇండియా పార్టీ ఆర్ధిక స్వేచ్చ విజయ సంకల్ప యాత్రను మే నెల ఒకటవ తేదీ నుండి గోదావరిఖని లో ప్రారంభిస్తున్నట్లు న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా జే వి రాజు బాయ్ పటేల్ ప్రకటించారు. ఈమేరకు శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు యాత్ర విషయాలు వెల్లడించారు. ఆర్ధిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్రలో న్యూ ఇండియా పార్టీ ప్రజలతో మమేకమై , ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను, ఎండగడుతు అలాగే ప్రతి ప్రజకి ఆర్ధిక స్వేచ్చ కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రజలను చైతన్య పరుస్తుంది అన్నారు. అలాగే డా బి ఆర్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన అమూల్యమైన ఓటును తాత్కాలిక ప్రలోబాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసే విదంగా అవగాహన కల్పిస్తాం అన్నారు. న్యూ ఇండియా పార్టీ ఒక సామాన్యుడి పార్టీ కాని ఆ సామాన్యుడికి రాజ్యాధికారం దక్కించే దిశగా న్యూ ఇండియా పార్టీ పని చేస్తుంది అని తెలిపారు.ఇందులో బాగంగ న్యూ ఇండియా పార్టీ రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటిచేస్తుంది అని ఆయన ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలను మద్దతు తెలుపమని కోరుతు యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఆర్ధిక స్వేచ్ఛ విజయ సంకల్పయాత్ర విజయవంతం చేయాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా జె వి రాజు, ఉపాధ్యక్షుడు వేముల అశోక్, జే లక్ష్మి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి, గోపాల్, తోగరి బానేష్, గంట భబిత సోని, ఆర్ ఎస్ వి పటేల్, బోగిరి పొచం, రజిత, నీరటి శంకర్, చాణక్య, మల్లేష్,స్వరూప, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!