వెల్దుర్తి ఏప్రిల్ 29 (అఖండ భూమి) : ప్రభుత్వ పాలన భేష్ ని పీపుల్స్ సర్వేలో ప్రజానీకం అంటున్నారని జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో తాము జరిపిన మెగా పీపుల్ సర్వేలో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు స్థానిక సొసైటీ కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలోని తమ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కలిసి వెల్దుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంత మైందన్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం కోటి 45 లక్షల మంది మెగా పీపుల్ సర్వే లో భాగంగా కోటి పది లక్షల మందికి మించి కుటుంబాలు జగనన్న జగనన్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన ప్రాణం మళ్ళీ రావాలని ఆయన మీద తమకు నమ్మకం ఉందని తెలిపారు అన్నారు కేవలం తన నియోజకవర్గంలోనే తమ పార్టీ నాయకులు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు కార్యకర్తలు వాలంటీర్లు కలిసి జరిపిన సర్వేలో 89,445 కుటుంబాలను సందర్శించగా 79036 మంది తిరిగి జగనన్న రావాలని కోరుకున్నారని వారు తమ సంతోషంగా 60,402 కుటుంబాలు జగనన్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మిస్సుడు కాల్ ఇచ్చారని తెలిపారు..ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, జిల్లా నాయకులు, మైనారిటీ నాయకులు, పార్టీ మండల కన్వీనర్లు, సచివాలయ మండల కన్వీనర్లు, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


