దళితుల సమస్యల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించాలి… ఎమ్మార్పీఎస్

దళితుల సమస్యలు పరిష్కారం కొరకు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలి… ఎమ్మార్పీఎస్

కర్నూలు ఏప్రిల్ 29 (అఖండ భూమి) :

కర్నూల్ కలెక్టర్ సృజనని కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎమ్ రమేష్ మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని దళితుల సమస్యలు పరిష్కారం కు నోచుకోక విపరీతంగా ఉన్నాయని బాధితులు కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారి సమస్యలు అధికారులు పరిష్కరించడం లేదు దళితుల భూములు పెత్తందారులు ఆక్రమించుకోవడం రాజకీయ పలుకుబడితో దళితుల భూములను ఆన్లైన్లో అడంగల్ వన్ బి మార్పిడి చేసుకొని ఉన్నత కులాల పేర్లు ఎక్కించుకొని రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు రెవెన్యూ అధికారులు మోసం చేయడం సాగులో ఉన్న భూములను సర్వేర్లు కొలతలు వేయకుండా నిర్లక్ష్యం చేయడం అసైన్మెంట్ భూములు అక్రమాలకు గురికావడం కుల వివక్షత అంటరానితనంతో దళితులే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు చేయడం గ్రామాల్లో దేవాలయాల ప్రవేశాలు లేకపోవడం నూతన వధూవరులు వాహనం పై పెళ్లి మేరమన ఊరేగింపు చేపడితే గ్రామాల్లో కట్టుబాట్లతో ఉండాలి లేకపోతే దాడులు చేస్తామని పెత్తందారులు దళితులను బెదిరించడం జరుగుతుంది తద్వారా జిల్లా కలెక్టర్ దళితుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ పరిష్కార వేదిక ఏర్పాటు చేసి తక్షణమే సంబంధిత అధికారితో హీరింగ్ జరిపి వెనువెంటనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరడమైనది స్పందించిన కలెక్టర్ దళితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తాం సమస్యలు వెనువెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని తెలపడం మైనది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య మాదిగ పత్తికొండ నియోజకవర్గం కన్వీనర్ రామాంజనేయులు మాదిగఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ పెదరాజు మాదిగ దేవనకొండ మండలం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాదిగతదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!