గొడవ కేసులో ముద్దాయిల అరెస్టు…

కర్నూల్ నాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ కేసు నెంబర్ 93/2023 U/sec 302, 324, 506 r/w 34 IPC & sec 3(2)(v), sec 3(2) (va) and sec 3(1) (r) (s) of SC,ST POA Act. ఈ నెల 16 వ తేదిన ముజఫర్ నగర్ లో మధ్యాన్నం 01.00 గం సమయంలో సెల్ ఫోన్ విషయం లో బ్రహ్మాజీ మరియు రాజశేఖర్ గొడవపడడం జరిగింది. ఆ విషయం సంభందించి రాత్రి 7 గంటలపుడు బ్రహ్మాజీ మరియు చాట్ల కార్తిక్ @ బన్ని వయస్సు 19 సం!!లు అను వ్యక్తితో అదే వీదికి చెందిన 1. షేక్ ఫారూక్, వయసు 24 సం!!లు 2. కాసిపోగు రాజశేఖర్ @ పండు, వయసు 24 సం!!లు అను ఇద్దరు వ్యక్తులు మాదిగ ఎల్లమ్మ బజ్జిల అంగడి వద్ద గలాటా పడి కార్తిక్ ను కులం పేరుతో దూషించి, కొట్టి అతని పై పెన్నేమ్ లో బజ్జిల వేయుట కోరకు పోయి మీద పెట్టిన మరుగుతున్న నూనే ను పెన్నేమ్ తో సహా కార్తీక్ పై వేయగా కార్తీక్ కు ఒళ్ళంతా నూనే పడి బొబ్బలు లేచి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ 26-04-23 వ తేదిన ఉదయము 9 గంటలకు చనిపోయినాడు. కార్తీక్ తల్లి మహేశ్వరీ కి కూడా ఎడమ చేయి పైన నూనే పడి బొబ్బలు లేచినవి. కార్తీక్ తల్లి మహేశ్వరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూల్ నాలుగ పట్టణ పోలీసు వారు కేసు నమోదు చేసినారు.కేసు దర్యాప్తు అధికారి అయిన SDPO కర్నూల్ శ్రీ K.V. మహేష్ గారి దర్యాప్తు లో భాగముగా ఈ దినము అనగా 29-04-2023 వ తేదిన సాయంత్రము 4.00 గంటలపుడు, చెన్నమ్మ సర్కిల్ వద్ద కేసులో ముద్దాయిలు అయిన 1. షేక్ ఫారూక్ 2. కాసిపోగు రాజశేఖర్ @ పండు అను వీరులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించడ మైనది.

1. షేక్ ఫారూక్, వయసు 24 సం!!లు తండ్రి షేక్ మబాష ముజఫర్ నగర్, కల్లూర్ మండలం,

కర్నూల్ టౌన్2. కాసిపోగు రాజశేఖర్ @ పండు, వయసు 24 సం!!లు తండ్రి ఎసన్న, ముజఫర్ నగర్, కల్లూర్ కర్నూలు

Akhand Bhoomi News

error: Content is protected !!