
పవన్ కళ్యాణ్ పై గ్రామ వాలంటీర్లు నిరసన ధర్నాలు.
రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 12 వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు నిరసన చేశారు ఈ సందర్భంగా
గ్రామ వాలంటీర్ల పై వాలంటరీ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ రాజవొమ్మంగి మండలం గ్రామ వాలంటీర్లు ఖండిస్తూ నిరసన చేపట్టారు. బుధవారం రాజవొమ్మంగి మండలం లో జరిగిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని రాష్ట్రంలో వాలంటరీగా పనిచేస్తున్న వారందరికీ సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థని దూషించడం దారుణం అన్నారు. లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటు బాలికల కిడ్నాప్ చేయడం వంటి చర్యలు పై వాలంటీర్లపై రుద్దడం దౌర్జన్యం అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే వాలంటరీ వ్యవస్థ పై ఇటువంటి కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజవొమ్మంగి గ్రామ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


