సర్వేంద్రియానాం నయనం ప్రధానం….

సర్వేంద్రియానాం నయనం ప్రధానం….

Akhand Bhoomi Web News :

మానవుని శరీరంలో ఉండే అన్ని అవయవాల్లోకి అతి సున్నితమైన ఇంద్రియం కన్ను అని ఈ కంటి పరిరక్షణకు నిరంతరమూ జాగ్రత్తలు వహించాలని కడుము ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. పాఠశాలలో నిర్వహించిన కంటి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గొర్లె తిరుమలరావు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అని, విద్యార్థులంతా ఆరోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు వహించాలని అన్నారు.

కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆరోగ్య తనిఖీ నిమిత్తం ఈ పాఠశాలకు విచ్చేసిన ఎం.పి.హెచ్.ఎ.ఎం. సవర శ్రీనివాసరావు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, ఆహార నియమాలు వంటివి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని కాబట్టి వైద్యుల సూచనలతో విద్యార్థులంతా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని అన్నారు. ఎం.పి.హెచ్.ఎ.ఎఫ్. మిరియాల సరస్వతి మాట్లాడుతూ మూత వేసి ఉంచిన ఆహార పదార్థాలను భుజించాలని, వేడి నీరు విధిగా త్రాగాలని, ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆరోగ్య సమాజాన్ని పొందగలమని అన్నారు.

ఈరోజు పాఠశాలలో గల విద్యార్థులకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందిని గుర్తించామని అన్నారు.

వీరికి సత్వరమే ఐ డ్రాప్స్ మరియు మందులు అందజేస్తున్నామని అన్నారు. విద్యార్థిణీ విద్యార్థులకు సవర శ్రీనివాసరావు, మిరియాల సరస్వతి, రొక్కం మాలతీదేవి, ఆశ కార్యకర్తలు రౌతు సరోజిని, డి.సరోజనిలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు

తూటిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై.నరేంద్రకుమార్, రవికుమార్ మహాపాత్రో, సస్మిత పాఢి, ఎస్.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!