జాతీయ పేపర్ బ్యాగ్ దినోత్సవం….
అఖండ భూమి వెబ్ న్యూస్ :
పురస్కరించుకొని బుధవారం వెల్దుర్తి గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారిణి కవితా బాయి ఆధ్వర్యంలో జూట్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది. ..ఈరోజు మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే రేపటి తరాలకు మంచి చేసిన వాళ్ళమవుతామని ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో రకాల ప్లాస్టిక్ వస్తువుల్ని జీవితంలో నుంచి నిషేధించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.. పర్యావరణ హితాన్ని కోరుకునేవారు కొంచెం ఇబ్బంది అయినా జ్యూట్ బ్యాగులను పేపర్ సంచుల్ని బట్ట సంచుల్ని వాడాలని ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి చాలా రోజులు పడుతుందని ఈ విషయం అందరికీ తెలిసి కూడా పాలీవినైల్ బ్యాగులను వాడడం దురదృష్టకరమని ఇక నుంచైనా మేలుకొని పేపర్ బ్యాగులను, జ్యూట్ బ్యాగులను, సంచి బ్యాగులను వాడుదామని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి కవిత బాయి, ప్రముఖ సినీ నటుడు లెక్చరర్ దీవాన్ వలి ,ఖాదర్ బాషా, గ్రంధాలయ సిబ్బంది బీబీ తదితరులు పాల్గొన్నారు.



