Konaseema: భర్తను చెంబుతో కొట్టి చంపిన భార్య..
అయినవిల్లి: భర్త రోజూ తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో విసిగిపోయిన భార్య చెంబుతో కొట్టి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ మద్యం సేవించి భార్య సత్యనారాయణమ్మతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



