TTD: శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తితిదే ఈవో
తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు తితిదే ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు రేపు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు..
ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నందున.. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో నేడు వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించరు.
శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ” శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



