వందేభారత్ రైలులో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం
భోపాల్ : వందేభారత్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయిస్టేషన్ వద్ద జరిగింది..
రాణికమలాపాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద రైలులోని సీ-14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



