Chandrababu: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన
అమరావతి: రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు..
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అందరి బాధ్యతన్న చంద్రబాబు.. ఓటుతోనే భద్రత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఓటు మన బాధ్యత.. ఓటుతో భద్రత’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



