Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ
కడప (చిన్నచౌక్): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు..
ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



