ప్రతిపక్షాల భేటీ.. నీతీశ్‌ కుమార్‌ను విమర్శిస్తూ పోస్టర్లు..

 

Nitish Kumar: ప్రతిపక్షాల భేటీ.. నీతీశ్‌ కుమార్‌ను విమర్శిస్తూ పోస్టర్లు..

బెంగళూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమి లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించాయి..

రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. అయితే, విపక్షాల రెండో రోజు భేటీ సందర్భంగా బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరులోని చాళుక్య సర్కిల్‌ సహా అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రతిపక్షాల భేటీ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం..

 

ఒక పోస్టర్‌లో బిహార్‌లో సుల్తాన్‌గంజ్‌ వంతెన కూలిపోవడాన్ని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. ” బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు స్వాగతం. సుల్తాన్‌గంజ్‌ వంతెన నీతీశ్‌ కుమార్‌ బిహార్‌కు ఇచ్చిన బహుమతి. అది ఎప్పుడూ కూలిపోతూనే ఉంటుంది. నీతీశ్‌ పాలనను బిహార్‌లో వంతెనలు తట్టులేకపోతున్నాయి. అలాంటి వ్యక్తిపై ప్రతిపక్షాలు ఐక్యత కోసం ఆధారపడుతున్నాయి” అని ఒక పోస్టర్‌లో రాశారు. మరో పోస్టర్‌లో ”నిలకడలేని ప్రధానమంత్రి పోటీదారు. బెంగళూరులో బిహార్‌ సీఎంకు రెడ్‌కార్పెట్‌ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. సుల్తాన్‌గంజ్‌ బ్రిడ్జ్‌ మొదటిసారి కూలింది ఏప్రిల్ 2022, రెండోసారి కూలింది జూన్ 2023” అంటూ విమర్శించారు..

ఈ పోస్టర్ల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కార్పొరేషన్‌ సిబ్బంది సహాయంతో వాటిని తొలగించారు. విపక్షాల భేటీలో భాగంగా రెండో రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతిపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, కన్వీనర్‌గా బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది..

Akhand Bhoomi News

error: Content is protected !!