ఫోటో ట్రేడ్ ఫెయిర్ పోస్టర్ను ఆవిష్కరించిన కోటనందూరు మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్
కాకినాడ జిల్లా, కోటనందూరు మండలంలో మండల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ మీటింగ్ ప్రెసిడెంట్ వమ్మల దొంగబాబు ఆధ్వర్యంలో అమావాస్య నెలవారి మీటింగ్ జరిగినది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ దొంగబాబు మాట్లాడుతూ ఐకమత్యంతో మన యూనియన్ ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్క సభ్యుడు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రెసిడెంట్ పోసిన వీరేంద్ర గారి నాయకత్వంలో రాష్ట్ర అసోసియేషన్, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ బచ్చు వీర వెంకట సత్యనారాయణ (చిన్ని) ఆధ్వర్యంలో జిల్లా అసోసియేషన్ పటిష్టంగా ఉన్నాయని, వీరి ఆధ్వర్యంలో 2023 ఆగస్టు 4 ,5, 6 తేదీలలో రాజమండ్రి ఎస్వీపిసీ కన్వెన్షన్ హాల్లో ఫోటో ట్రేడ్ ఫెయిర్ జరుగుతుందని, ప్రతి సభ్యుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో శరవేగంగా మారుతున్న నూతన టెక్నాలజీని తెలుసుకొని దానికి అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరము పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ గుద్దటి రాజు, ట్రెజరర్ వంకల నాని, వైస్ ప్రెసిడెంట్ బత్తిన సూర్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ నవీన్, గౌరవ అధ్యక్షులు చిటికెల విజయ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ చింతకాయల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.



