Purandeswari: త్వరలో పవన్‌కల్యాణ్‌తో భేటీ: పురందేశ్వరి
అమరావతి: ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు.
ఆర్థిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
త్వరలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)తో భేటీ అవుతానని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో తాను జోన్ల వారీగా పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు..
”ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.7.14లక్షల కోట్ల మేర అప్పు చేసింది. అనధికార అప్పులే రూ.4లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి” అని పురందేశ్వరి డిమాండ్ చేశారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



