జగనన్న ఇళ్ల పేరుతో కాసుల వర్షం కురిపించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్… 

జగనన్న ఇళ్ల పేరుతో కాసుల వర్షం కురిపించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్…

కర్నూలు జిల్లా వెల్దుర్తి జులై 19 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల పరిధిలోని రామళ్లకోట సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ జగనన్న ఇళ్ల పేరుతో కాసుల వర్షం కురిపించినట్లు విశ్వనీయత సమాచారం. ఆ గ్రామంలో ఇంటికో లెక్క వసూలు చేసినట్లు లబ్ధిదారులు తెలుపుతున్నారు. కాసులు ఇస్తేనే మీ ఇంటి నిర్మాణానికి బిల్లు శాంక్షన్ అయ్యేది అని లబ్ధిదారులతో ముందస్తుగా వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వా పోతున్నారు. బేస్మెంట్ నిర్మాణానికి ఒక లెక్క, లెంటల్ లెవెల్స్ కు మరో లెక్క, పూర్తిగా కప్పు బిల్లుకు మరో లెక్క చొప్పున వసూలు చేస్తున్నదని లబ్ధిదారులు తెలిపారు. గ్రామానికి చెందిన గోనెగండ్ల లచ్చమ్మతో 20వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిపారు. రామళ్లకోట గ్రామానికి 176 జగనన్న బిల్డింగులు సాంక్షన్ అయ్యాయి. 138 మందికి బిల్లులు శాంక్షన్ అయ్యాయి. ఇందులో భాగంగా 83 మంది లబ్ధిదారులకు పూర్తి బిల్లులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో బేస్మెంట్ లబ్ధిదారులు 31 మంది ఉన్నారు. లెంటల్ లెవెల్ అయిన లబ్ధిదారులు 16 మంది ఉన్నారు. పూర్తిగా పైకప్పు వేసిన లబ్ధిదారులు 8 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కొక్క లబ్ధిదారుడు దగ్గర నుండి 20వేల నుండి 40 వేల వరకు వసూలు చేసినట్లు లబ్ధిదారులు తెలిపారు. దీంతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్షల్లో దందాలు కొనసాగించినట్లు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే తరహాలో మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల దందాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని లబ్ధిదారుల తోపాటు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!