కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెబ్ న్యూస్ :
ఈ జులై 23వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య
స్టేడియం నందు నిర్వహించే రేషన్ డీలర్ల మహాసభను జయప్రదం చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.ఖాద్ర బాషా, ఉమ్మడి జిల్లాల రస్వనర్ కలిబట్లూ పిలుపు నిచ్చారు.బుధవారం వెల్దుర్తిలో అల్లిపీరా స్వామి

భజన మందిరం నందు వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుమా, రాష్ట్రంలో రేషన్ డీలర్ల భవిష్యక్ ఆందోనకరంగా ఉందని చాలి చాలని కమిషన్లతో దశాబ్దాల తరబడి జీవితాలను నెట్టుకొస్తున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిత్యవసర
సరుకులు అన్ని పెరగడంతో మాకు ఇస్తున్న కమీషన్ చాలక కటుంబాలను పోషించుకోలేని రేషన్ డీలర్లు ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.
కావున రేషన్ డీలర్ల ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కల్పించాలని ప్రధాన డిముండ్లో ఈ నెల 8వ తేదిన విజయవాడలో రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ మహాసభను నిర్వహించి, ఈ సభ ద్వారా తమ డిముండ్లను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నామని అన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన దిహండ్ల పట్ల సానుకలంగా స్పందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం సానుకులంగా స్పంచకంటే తమ ఫారానికి రూపకల్పన చేసుకుంటారని అన్నారు. కావున రేషన్ డీల్ల మహాసభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి డీలర్ రవలి రావాలన విజ్ఞప్తి చేశారు. రాళ్లక్రమంలో జిల్లా నామకులు ఓర్వకల్ శ్రీను, వెల్దుర్తి, క్రిప్తగిరి మండల అధ్యక్షులు, గోపినాథ్ నాయుడు, అంగారెడ్డి, కార్యదర్శి.కంగాటి వెంకటరామిరెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె డీలర్ శీను, నార్దాపురు సర్పంచ్ కోటి రెడ్డి, రమణ, ప్రభాకర్, శేషన్న, వాసు, ఖాజాబీ, ముని, ఎల్లారెడ్డి, సుడెపల్లి వెంకటేశ్వర్ రెడ్డి డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


