గాలి వానలకు 20 గొర్రెలు మృతి….
యాదాద్రి కొత్తగూడెం జిల్లా అడ్డగూడురు జులై 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండల కేంద్రమైన అడ్డగూడూరు గ్రామానికి చెందిన నోముల నవీన్ అనే గొర్రెల రైతు కు 20 గొర్రెలు గురువారం గాలి వాన ప్రభావంతో మృతి చెందినట్లు తెలిపారు. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా గాలి వాన లకు తట్టుకోలేక మృతి చెందినట్లు గొర్రెల రైతు నోముల నవీన్ వాపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి జీవాలను బ్రతికించుకొని కాయకష్టంతో పెంచుకున్న గొర్రెలు మృతితో దాదాపు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొర్రెల రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని అడ్డగూడురు మండల ప్రజలు కోరుతున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



